- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వాయిదా
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదికలో కీలక ఆధారాలు లభించినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఫొరెన్సిక్ నివేదికలో కీలకమైన ఆధారాలు లభించాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై ఇవాళ జస్టిసి బీవీ నాగరత్న,జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది. విచాణ సందర్భంగా ఎఫ్ఎస్ఎల్ (FSL report) నివేదిక అందిందని అందులో డిజిటల్ ఫోరెన్సిక్ ప్లాట్ ఫామ్ నుంచి కీలక ఆధారాలు లభించాయని కోర్టుకు తెలిపారు. ఈ వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం అక్టోబర్ 14కు వాయిదా వేసింది. కాగా గత విచారణలో సందర్భంలో ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరించడం లేదని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో దర్యాప్తుకు సహకరించాలని ప్రభాకర్ రావును కోర్టు ఆదేశించింది.






