ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆ రోజున సిట్ విచారణకు బండి సంజయ్

by Kema Shiva Kumar |

రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ (SIT) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆ రోజున సిట్ విచారణకు బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ (SIT) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సిట్ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. దర్యాప్తులో భాగంగా గతంలో తమ ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్లు ఆరోపించి ఫిర్యాదు చేసిన నేతలకు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి వారిచ్చే స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు. ఇప్పటి పార్టీలకు అతీతంగా పదుల సంఖ్యలో నేతలు సిట్ అధికారులకు తమ వాంగ్మూలం ఇచ్చారు. మొదట జూలై 17న సిట్ నుంచి నోటీసుల అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) జూలై 24న విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ముందే ఫిక్స్‌ అధికారిక కార్యక్రమాల వల్ల విచారణకు హాజరుకావడం లేదని విచారణ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో ఇవాళ మరోసారి సిట్ ఈ నెల 8న విచారణకు హాజరు కావాలంటూ బండి సంజయ్‌కి నోటీసులు ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే సిట్ నోటీసులు అందుకున్న బండి సంజయ్ (Bandi Sanjay) విచారణకు హాజరవుతానని ప్రకటించారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా అదే రోజు విచారణకు అటెండ్ కాబోతున్నారు. అదేవిధంగా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై పోలీసు ఉన్నతాధికారులకు ఓ లేఖను రాశారు. కేంద్ర నిఘా వర్గాల కీలక సమాచారంతో పాటు సేకరించిన ఆధారాలను కూడా సిట్‌కు అందజేయనున్నారు. మరోవైపు భార్యభర్తల బెడ్ రూమ్‌లో మాటలను ట్యాప్ చేయడాన్ని బీజేపీ (BJP) అధిష్టానం ఇప్పటికే సీరియస్‌గా పరిగణిస్తోంది. అదేవిధంగా కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు (High Court)లో బీజేపీ లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) పాత్రపై ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ ఎదుట రాధాకిషన్ అంగీకరిండం, డీజీపీ (DGP) ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ అగ్ర నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం‌పై జాతీయ స్థాయిలో చర్చకు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story