Bandi Sanjay: ప్రభాకర్ రావు ఓ నీచుడు.. భార్యభర్తల ఫోన్ సంభాషణలను కూడా ట్యాప్ చేశాడు: బండి సంజయ్

by Prasad Jukanti |   (  Updated:2025-06-09 11:50:03  IST  )

అమెరికాలో ప్రభాకర్ రావుకు కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చిందని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay: ప్రభాకర్ రావు ఓ నీచుడు.. భార్యభర్తల ఫోన్ సంభాషణలను కూడా ట్యాప్ చేశాడు: బండి సంజయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మామూలోడు కాదని, మా లాంటి అనేక మంది కార్యకర్తల ఉసురుపోసుకున్నాడని కేంద్ర మంత్రి బండిసంజయ్ (Bandi Sanjay) ధ్వజమెత్తారు. అమెరికాలో ప్రభాకర్ రావుకు కేసీఆర్ (KCR) ఫ్యామిలీ కౌన్సిలింగ్ పూర్తయిందని దాంతో పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యారని ఆరోపించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ప్రభాకర్ రావు (Prabhakar Rao) విచారణ స్టేట్ మెంట్ బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, నాతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన ఘనుడు ప్రభాకర్ రావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావు వల్ల అనేక మంది జీవితాలు నాశనం అయ్యాయి, ఎన్నో కుటుబాలు రోడ్డున పడ్డాయి. భార్యభర్తల ఫోన్ సంభాషణలను కూడా ట్యాప్ (phone tapping case) చేసిన నీచుడు అని మండిపడ్డారు. ఎవరి ఆదేశంతో ఫోన్ ట్యాప్ చేశారో ప్రజలకు తెలియాలి, ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటిని ఏం చేశారు? ఆ ఆడియోలను ఎవరికి పంపారు? ఆ ఆడియోలను అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారో తేల్చాలన్నారు. చట్టప్రకారం లోబడే ప్రభాకర్ రావుపై సీరియస్ గా చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసనం సన్నగిల్లుతోంది. ఏ ఒక్క అవినీతి కేసులో కూడా విచారణ ముందుకు సాగలేదు. ఇకనైనా కోర్టులో గట్టిగా వాదనలు వినిపించి ప్రభాకర్ రావు సహా ఆయన వెనుకున్న సూత్రధారులను, దోషులుగా తేల్చాల్సిందేనన్నారు.

Phone tapping case: ఆధారాలు ఉంటే చూపించండి.. సిట్ అధికారులకే ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నలు!

Next Story