- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేడు విచారణకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ (SIT) అధికారులు జెట్ స్పీడ్‌లో విచారణ కొనసాగిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ (SIT) అధికారులు జెట్ స్పీడ్‌లో విచారణ కొనసాగిస్తున్నారు. దొరికిన సమాచారం ప్రకారం మొత్తం 618 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని నిర్ధారించారు. అందులో ఇప్పటి వరకు 228 మందికి నోటీసులు ఇచ్చి కేసులో వారి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు (Vemuri Radha Krishna) సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకానున్నారు.
ఎస్ఐబీ (SIB) వద్ద ఉన్న కాల్ డిటైల్ రికార్డ్స్ (CDR)లో ఆయన ఫోన్ నెంబర్ ఉన్నట్లుగా తేలింది. దీంతో కేసులో విచారణలో భాగంగా ఆయన వాంగ్మూలం అవసరమని సిట్ అధికారలు ఆ నోటీసులలో పేర్కొన్నారు. దీంతో ఇవాళ వేమూరి రాధాకృష్ణ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరకానున్నారు. అదేవిధంగా చేవెళ్ల ఎంపీ, బీజేపీ సినీయర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని, విచారణకు రావాలంటూ ఆయనకు కూడా సిట్ అధికారుల నుంచి నోటీసులు అందినట్లుగా తెలుస్తోంది. 2023 నవంబర్ నెలలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్‌ను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు.






