- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దార్శనికుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్.. మాజీ మంత్రి కేటీఆర్
తెలంగాణ బిడ్డల ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణం నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బిడ్డల ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణం నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ‘తెలంగాణ ఇంజినీర్స్ డే’ను పురసర్కరించుకుని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ నీటిపారుదల రంగానికి విశేషమైన సేవలందించిన గొప్ప ఇంజనీర్ నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహాదుర్ అని కొనియాడారు. తన దార్శనికతతో భవిష్యత్తు సాగు, తాగునీటి అవసరాలకు అందేలా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని తెలిపారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, దిండి, కోయల్‌సాగర్, కడెం, పోచంపాడు, లోయర్ మానేరు మొదలగు ప్రాజెక్టులు ఆయన నిర్మించినవేనని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ, అఫ్జల్‌గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రెరీ, ఉస్మానియా ఆసుపత్రి వారి కాలంలో రూపుదిద్దుకున్నవేనని పేర్కొన్నారు. నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహాదుర్ చేసిన కృషిని గౌరవిస్తూ ఏటా జూలై 11న వారి జయంతిని తెలంగాణ ఇంజినీర్స్ డేగా నిర్వహించాలని కేసీఆర్ గారు నిర్ణయించారని. 2014 నుంచి ఏటా ఇదే తేదీన వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదుర్ జయంతి సందర్భంగా.. ఇంజనీర్లందరికీ ‘తెలంగాణ ఇంజినీర్స్ డే’ శుభాకాంక్షలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.






