Counseling Schedule: పీజీఈసెట్, లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

by Prasad Jukanti |   (  Updated:2025-07-25 09:30:25  IST  )

పీజీఈసెట్, లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.

Counseling Schedule: పీజీఈసెట్, లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ (TG PGECET 2025), లా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి లాసెట్‌ (TG LAWCET-2025) అడ్మిషన్లకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొ. వి.బాలకృష్ణ నేతృత్వంలో పీజీఈసెట్, లాసెట్ అడ్మిషన్ కమిటీ ఇవాళ సమావేశమైంది. ఈ సందర్భంగా రెండు సెట్లకు సంబంధించి షెడ్యుల్ ను విడుదల చేశారు. ఈ నెల 26న పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 1 నుంచి 9 వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుంది. ఆగస్టు 12,12 తేదీలలో పీజీ ఈ సెట్ మొదటి విడత వెబ్ ఆప్షన్లు అవకాశం ఉండగా ఆగస్టు 16న పీజీఈ సెట్ సీట్ సీట్లు కేటాయించనున్నారు. ఆగస్టు 18 నుంచి 21 వరకు కాలేజీలల్లో విద్యార్థులు రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు.

లాసెట్, పీజీ లా సెట్-2025:

లాసెట్-2025 కు సంబంధించి ఈ నెల 26న లా సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 4 నుంచి 14 వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, ఆగస్టు 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 22న సీట్ల కేటాయిపు, ఆగస్టు 22 నుంచి 25 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ కు అవకాశం కల్పించారు. ఇక పీజీ లాసెట్ (TG PGLCET-2025) అడ్మిషన్ల కోసం ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, సెప్టెంబర్ 3,4 తేదీల్లో వెబ్ ఆప్షన్లు, సెప్టెంబర్ 8న సీట్లు కేటాయించనున్నారు. సెప్టెంబర్ 9 నుంచి 13 వరతకు సెల్ఫ్ రిపోర్టింగ్ కు అవకాశం కల్పించారు.

Next Story