ప్రశాంతంగా ముగిసిన పీజీఈసెట్ పరీక్ష

by Muthe.Rajitha |

తెలంగాణలోని యూనివర్సిటీలు, అనుబంధ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎం ఆర్చ్ లాంటి పలు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ పరీక్ష సోమవారం మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

ప్రశాంతంగా ముగిసిన పీజీఈసెట్ పరీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని యూనివర్సిటీలు, అనుబంధ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎం ఆర్చ్ లాంటి పలు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ పరీక్ష సోమవారం మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.ఈ పరీక్షకు మొదటి సెషన్ లో జియోఇంజినీరింగ్, జియోఇన్ఫర్మాటిక్స్ , ఫార్మసీ విభాగాలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ , ఫుడ్ టెక్నాలజీ , ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగాలకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొదటి సెషన్ కు హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి 7934 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 7630(96.17 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండో సెషన్ లో 4512 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 3996 మంది (88.56 శాతం) హాజరయ్యారు.

Next Story