- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉస్మానియాలో విద్యార్థి ఆత్మహత్య.. ర్యాగింగ్ వల్లే అంటున్న పేరెంట్స్
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ జనరల్ సర్జరీ విభాగంలో మొదటి సంవత్సరం పీజీ చదువుతున్న డాక్టర్ సురేష్ కాట్రావత్ అకాల మరణం వైద్యులు, వైద్య విద్యార్థులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా జనరల్ హాస్పిటల్ జనరల్ సర్జరీ విభాగంలో మొదటి సంవత్సరం పీజీ చదువుతున్న డాక్టర్ సురేష్ కాట్రావత్ అకాల మరణం వైద్యులు, వైద్య విద్యార్థులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటనపై హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూనే.. మెడికోల మానసిక ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. వరుసగా పెరుగుతున్న పని గంటలు, విపరీతమైన ఒత్తిడి, అధిక అంచనాల మధ్య పీజీ విద్యార్థులు నలిగిపోతున్నారని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. వైద్యుల్లో మానసిక సమస్యలపై ఉన్న నిశ్శబ్దాన్ని వీడి, వారికి తక్షణమే కౌన్సెలింగ్, వృత్తిపరమైన సహాయం అందించాలని డిమాండ్ చేసింది. శారీరక ఆరోగ్యంతో పాటే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చేలా వైద్య విద్యలో మార్పులు రావాలని, అప్పుడే ఇలాంటి ప్రాణ నష్టాలను అడ్డుకోగలమని హెచ్ఆర్డీఏ స్పష్టం చేసింది. డాక్టర్ సురేష్ కుటుంబానికి అసోసియేషన్ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
ర్యాగింగ్ వల్లే చనిపోయాడు...
ఉస్మానియా ఆస్పత్రిలోని పీజీ హాస్టల్‌లో సురేశ్ అనే వైద్య విద్యార్థి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే ఉస్మానియా కళాశాలలో పీజీలో చేరినట్లు తెలిపారు. ర్యాగింగ్ వల్లే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వద్ద సురేశ్ కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని... ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి.






