ఇక నుండి ప్రతీ ఆదివారం పెట్రోల్ బంకులు బంద్!

by Gantepaka Srikanth |

దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక నుండి ప్రతీ ఆదివారం పెట్రోల్ బంకులు బంద్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మే 14 నుంచి దేశంలోని ఎనిమిది ప్రధాన రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులను మూసివేసేలా నిబంధనలు అమలు చేయనున్నట్లు సమాచారం. ఇంధన పొదుపు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఇంధన కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రధాని తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. అనవసరపు ఇంధన వృధాను అరికట్టేందుకు ఆయన తన పర్యటనల్లో పొదుపు చర్యలు ప్రారంభించారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

పర్యావరణ హితం..

కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణాన్ని కాపాడేందుకు ఆదివారం సెలవు ప్రకటించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. తొలి దశలో భాగంగా ఎంపిక చేసిన 8 రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలు కానున్నాయి. ప్రధాని మోడీ బాటలోనే సామాన్య ప్రజలు కూడా అనవసరంగా వాహనాలు వాడకుండా ఇంధనాన్ని పొదుపు చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. అయితే, ఆదివారం బంకులు బంద్ అని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారమవుతున్నప్పటికీ, దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ నుండి గానీ, చమురు సంస్థల నుండి గానీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన (Official Circular) రాలేదు. కాబట్టి వాహనదారులు తమ ప్రాంతంలోని బంకుల వద్ద సమాచారాన్ని సరిచూసుకోవాలని సూచించడమైనది.

Next Story