- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్
రెండో విడత పంచాయతీ ఎన్నికల రోజున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పరీక్ష నిర్వహించడంతో ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నట్లు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రెండో విడత పంచాయతీ ఎన్నికల రోజున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పరీక్ష నిర్వహించడంతో ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నట్లు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల వల్ల పరీక్ష వాయిదా వేయాలని రాజన్న సిరిసిల్లకు చెందిన దివాకర్ అనే అడ్వకేట్ పిటిషన్‌లో పేర్కోన్నారు. జస్టిస్ తిరుమలదేవి నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను శుక్రవారం విచారించింది. పరీక్ష నిర్వహణకు ఒక్క రోజు మాత్రమే గడువుందని పిటిషనర్ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ 2015 జూలైలో జారీ చేసిన జీవో ఎంస్ నెం 54 ఆధారంగా చూపుతూ పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థించారు.
ప్రధాన న్యాయమూర్తితో కూడిన డివిజన్ బెంచ్‌తో సహా హై కోర్టులోని వివిధ బెంచ్‌లు రెండు రిట్ పిటిషన్ దాఖలు చేయబడ్డయని ప్రభుత్వ తరపున కౌన్సిల్ మెంబర్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల విజ్ఞప్తులను పరిగణించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, సంబంధిత అధికారులు అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనానికి రోస్టర్ (కేసుల జాబితా/అధికార పరిధి) లేనందున, ఈ విషయాన్ని రోస్టర్ ఉన్న బెంచ్ ముందు లంచ్ మోషన్‌గా జాబితా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.






