- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త లిక్కర్ పాలసీపై హైకోర్టులో పిటిషన్.. నవంబర్ 3కు విచారణ వాయిదా
2025-27 సంవత్సరానికి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: 2025-27 సంవత్సరానికి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన గడ్డం అనిల్ కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. నూతన మద్యం విధానంలో ధరఖాస్తు ఫీజ్ రూ.3 లక్షలుగా నిర్ణయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ నిర్వహించే లాటరీ విధానంలో మద్యం షాపు తగలక పోతే ధరఖాస్తు ఫీజుగా చెల్లించిన రూ.3 లక్షలు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. మద్యం షాపు తగిలిన ధరఖాస్తుదారు నుంచి రిటైల్ షాప్ ఎక్సైజ్ పన్ను, స్పెషల్ రిటైల్ ఎక్సైజ్ పన్ను, టర్నోవర్ పన్ను వసూలు చేస్తున్నారని తెలిపారు. వాటి నుంచి లాటరీ షాపు తగలిని వారికి వారు చెల్లించిన ధరఖాస్తు ఫీజు చెల్లించాలని విజ్ఞప్తిగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను జస్టీస్ శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను పరిశీలించింది. పిటిషనర్ అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 3కు వాయిదా వేసింది.






