- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kaleshwaram ENC: వారం రోజుల పాటు హరిరామ్‌ను కస్టడీకి ఇవ్వండి.. ఏసీబీ కోర్టులో పిటిషన్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాళేశ్వరం ఈఎన్‌సీ భూక్యా హరిరామ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాళేశ్వరం ఈఎన్‌సీ భూక్యా హరిరామ్ (ENC Hariram) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రిమాండ్ మీద చంచల్ గూడ జైల్లో ఉన్నారు. అయితే హరిరామ్‌ను కస్టడీకి కోరుతూ సోమవారం కోర్టులో ఏసీబీ (ACB) పిటిషన్ దాఖలు చేసింది. వారం రోజుల పాటు హరిరామ్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ పిటిషన్‌లో పేర్కొంది. (Kaleshwaram) కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన హరి రామ్ ఇంట్లో అతని బంధువుల ఇళ్లలో 13 చోట్ల ఇటీవల ఏసీబీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే దాదాపు రూ.200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్న విషయం విదితమే. ప్రస్తుతం ఈఎన్‌సీ హరిరామ్ (Chanchalguda Jail) చంచల్ గూడ జైలులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అయితే తన బినామీల గుట్టును హరిరామ్ బయటపెట్టలేదని సమాచారం. దీంతో ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఏసీబీ భావించినట్లు సమాచారం. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు సహా నీటిపారుదల శాఖలోని పలు కీలక ప్రాజెక్టుల్లో హరిరామ్ ముఖ్యపాత్ర పోషించారు. వేలకోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల పనులు హరిరామ్ చేతుల మీదుగా జరిగాయి. ఈ నేపథ్యంలోనే హరిరామ్ భారీగా అక్రమఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.






