TG High Court:థియేటర్లలోకి పిల్లల ఎంట్రీ.. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్

by Jakkula.Mamatha |

సినిమా థియేటర్లలోకి పిల్లల ప్రవేశం పై తెలంగాణ(Telangana) హైకోర్టు(High Court)లో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ యాజమాన్యాల సంఘం పిటిషన్ దాఖలు చేసింది.

TG High Court:థియేటర్లలోకి పిల్లల ఎంట్రీ.. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్
X

దిశ,వెబ్‌డెస్క్: సినిమా థియేటర్లలోకి పిల్లల ప్రవేశం పై తెలంగాణ(Telangana) హైకోర్టు(High Court)లో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ యాజమాన్యాల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో రాత్రి 11 నుంచి ఉదయం 11 లోపు థియేటర్లలోకి 16 ఏళ్ల లోపు పిల్లలను థియేటర్ల(Theatres)లోకి అనుమతించవద్దని హైకోర్టు ఇటీవల ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే పిల్లలు థియేటర్లలోకి ప్రవేశం పై హైకోర్టు ఆంక్షలు విధించడంపై అప్పీల్ పిటిషన్ దాఖలైంది. అయితే ఆ తీర్పుతో తాము నష్టపోతామని మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాల సంఘం పేర్కొంది. అయితే సింగిల్ బెంచ్ వద్ద పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున అప్పీలు పై జోక్యం చేసుకోలేమని సీజే బెంచ్ స్పష్టం చేసింది. ఆ పెండింగ్‌ పిటిషన్‌లోనే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. దీనికి పిటిషనర్లు అంగీకరించడంతో అప్పీల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

Next Story