HYD: రెండు హైరైజ్డ్ బిల్డింగ్స్‌కు సర్కార్ అనుమతులు

by Gantepaka Srikanth |

బంజారాహిల్స్‌లో రెండు హైరైజ్డ్ బిల్డింగ్స్‌కు అనుమతులు ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

HYD: రెండు హైరైజ్డ్ బిల్డింగ్స్‌కు సర్కార్ అనుమతులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బంజారాహిల్స్‌లో రెండు హైరైజ్డ్ బిల్డింగ్స్‌కు అనుమతులు ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. బంజారాహిల్స్‌లో నిఖిల్ కరణ్/ఇతరులకు సంబంధించిన స్టిల్ట్ ఫ్లోర్లను మినహాయింపుతో 10అంతస్తులు, రెండు అదనపు టీడీఆర్ ఫ్లోర్లతో కూడిన భవనానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దీంతోపాటు బంజారాహిల్స్ లోనే రొక్సానా ప్రాపర్టీస్ సంస్థకు రెండు సెల్లార్లు+మూడు స్టిల్ట్ ఫ్లోర్స్+12 ఫ్లోర్స్ బిల్డింగ్‌కు ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. అయితే హైరైజ్ భవనాలకు వర్తించే అన్ని ఇతర నియమాలు, నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతోపాటు అగ్నిమాపక సేవల విభాగం, భారత విమానాశ్రయ అథారిటీ నుండి అవసరైమన ఎన్ఓసీ కూడా పొందాల్సి ఉంటుందని వెల్లడించారు.

Next Story