ప్రజలు కాంగ్రెస్‌ను సస్పెండ్ చేస్తారు : మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని శాసనసభ నుండి సస్పెన్షన్ చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రజలు కాంగ్రెస్‌ను సస్పెండ్ చేస్తారు : మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని శాసనసభ నుండి సస్పెన్షన్ చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం తప్పిదాలను ప్రశ్నిస్తే సభ నుండి సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ్యులను ఎదుర్కొనే దమ్ములేక, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ చర్య తీసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసే సమయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. అధికారం ఉందని అడ్డగోలుగా ప్రవర్తిస్తే రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని హెచ్చరించారు.

Next Story