- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలు స్వార్థాన్ని, కల్మషాన్ని వీడాలి: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
by Kema Shiva Kumar |
విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రజలంతా స్వార్థం, కల్మషాన్ని విడనాడి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆకాంక్షించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రజలంతా స్వార్థం, కల్మషాన్ని విడనాడి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆకాంక్షించారు. ఇవాళ కరీంనగర్ (Karimnagar)లోని మహాశక్తి ఆలయంలో ఆయన శమీ పూజలో పాల్గొన్నారు. అనంతం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా ఒకరి కష్టాల్లో మరొకరు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా మందుకు రావాలన్నారు. దేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) నిరంతరం కృషి చేస్తున్నారు. ఆ దిశగా ప్రధానికి ఆ దుర్గామాత శక్తిని అందజేయాలని బండి సంజయ్ ఆకాంక్షించారు.
Next Story






