- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ నాటకాలను ప్రజలు నమ్మరు.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోరు బాట పట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోరు బాట పట్టారు. అన్నదాతకు సరిపడా యూరియా ఇవ్వాలని నిరసనలు గళం విప్పారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషన్ వద్దకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా వెళ్లారు. అనంతరం అగ్రికల్చర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసి అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సెక్రటేరియట్ ఎదుట ఆందోళన చేపట్టగా.. పోలీసులు వారి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నిరసనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూరియాపై బీఆర్ఎస్ నేతలది కపట నాటకమని మండిపడ్డారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రం కారణమని తెలియదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాటకలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరని మంత్రి తుమ్మల అన్నారు.






