గొడవ సద్దుమనగాలంటే అదొక్కటే మార్గం.. పచ్చళ్ల పంచాయితీలో వైరల్ అవుతున్న పెదరాయుడు తీర్పు

by Ramesh Goud |   (  Updated:2025-04-09 15:59:51  IST  )

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekya Chitti Pikils) వ్యవహారం తీవ్ర దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే.

గొడవ సద్దుమనగాలంటే అదొక్కటే మార్గం.. పచ్చళ్ల పంచాయితీలో వైరల్ అవుతున్న పెదరాయుడు తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekya Chitti Pikils) వ్యవహారం తీవ్ర దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. పికిల్స్ ఎందుకంత ధరకు అమ్ముతున్నారని కస్టమర్లు అడిగిన ప్రశ్నలకు వాట్సప్ లో అలేఖ్య చిట్టి పికిల్స్ నిర్వహకులు ఇచ్చిన సమాధానానికి సంబంధించి ఆడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో అలేఖ్య చిట్టి పికిల్స్ నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ సంఘటన మూలంగా అలేఖ్య, చిట్టి, రమ్య అనే ముగ్గురు అక్కా చెల్లెల్లు తమ పచ్చళ్ల బిజినెస్ ను పక్కన పెట్టి, సోషల్ మీడియాకు సైతం దూరం అయ్యారు. దీనిపై ఇప్పటికే వారు క్లారిటీ ఇచ్చినా.. అలేఖ్య చిట్టి పికిల్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు.

ఈ నేపథ్యంలో అలేఖ్య చిట్టి పికిల్స్ అంశంలో పాపారాయుడు తీర్పు అనే మీమ్ వైరల్ (Meme Viral) గా మారింది. "పచ్చళ్ల పంచాయితీలో పాపారాయుడు తీర్పు" అనే పేరుతో నెట్టంట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో అలేఖ్య చిట్టి పికిల్స్ అంశంలో నిర్వహకురాలు వివాదంపై క్లారిటీ ఇస్తున్న వీడియోకి ఓ వ్యక్తి పాపారాయుడు తీర్పు స్టైల్లో కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ లో "నువ్వు ఎన్ని వీడియోలు చేసిన లాభం లేదు అమ్మాయి.. ఆ గొడవ సద్దుమణగాలంటే ఒకటే మార్గం.. మీ అక్క ఆడియో వల్ల అతన్ని ఏ పిల్ల పెళ్లి చేసుకోదు.. కావున మీ అక్క అతన్ని పెళ్లి చేసుకోవలసిందే.. ఇదే ఈ పెదరాయుడు తీర్పు.." అని రాసుకొచ్చాడు. ఈ కామెంట్ కి పెదరాయుడు సినిమాలోని పాపారాయుడు తీర్పు వీడియోను యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ కామెంట్ తో పాటు వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటజన్లు స్పందిస్తూ.. ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Next Story