- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PDSU: విద్యాశాఖ మంత్రిని నియమించరా?
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిందని, అయినా విద్యాశాఖ మంత్రిని ఇంకెప్పుడు నియమిస్తారని పీడీఎస్‌యూ నాయకులు ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిందని, అయినా విద్యాశాఖ మంత్రిని ఇంకెప్పుడు నియమిస్తారని పీడీఎస్‌యూ నాయకులు ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం విద్యశాఖకు మంత్రి నియమించడంతో పాటు బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ‘ఛలో అసెంబ్లీ’ పేరిట రాష్ట్ర అధ్యక్షుడు పెద్దింటి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ అధ్యక్షతన అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం పీడీఎస్‌యూ నాయకులు మాట్లాడుతూ.. ఏండ్లు గడుస్తున్నా పెండింగ్ స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారని ప్రశ్నించారు. అలాగే విద్యారంగ సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం అవ్వకుండా చూడటంలో సర్కార్ విఫలమైందని విమర్శలు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై అసెంబ్లీలో చర్చించి, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, లేదంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముట్టడిలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బీ నరసింహారావు, ఎస్ అనిల్, ఎం నరేందర్, భాస్కర్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కాంపాటి పృథ్వీ, సాయి, కోశాధికారి సురేశ్, రాష్ట్ర నాయకులు వీ వెంకటేశ్, రాకేశ్, సీతారాం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.






