కాంగ్రెస్‌లోకి రావాలని ఆశపడుతున్న ఏలేటి.. పీసీసీ నేత సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

బీజేపీ గెలిచిన రెండు ఎమ్మెల్సీ సీట్లు బీఆర్ఎస్ పెట్టిన భిక్ష అని గుర్తు పెట్టుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం విమర్శించారు.

కాంగ్రెస్‌లోకి రావాలని ఆశపడుతున్న ఏలేటి.. పీసీసీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీజేపీ గెలిచిన రెండు ఎమ్మెల్సీ సీట్లు బీఆర్ఎస్ పెట్టిన భిక్ష అని గుర్తు పెట్టుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం (PCC spokesperson Satyam Srirangam) విమర్శించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అఖిల పక్ష మీటింగ్ రాలేము కుదరదు అంటున్నారని, బండి సంజయ్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీకు నిధులు తేవడం చేతకదాని ఒప్పుకోండి.. అని అన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి (Alleti Maheshwar Reddy) కి తన బీజేపీ ఆఫీస్‌లో కుర్చీ కూడా లేదన్నారు. ఆయన సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. అయన అనవసరంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలో‌కి పోయిన అని బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. అడ్డదిడ్డంగా మాట్లాడితే మళ్ళీ కాంగ్రెస్‌లోకి పిలుస్తారని ఆశ పడుతుండు.. ఆయనకు అంత సీన్ లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీ సీఎం కేసీఆర్ (KCR) మాటలను తీవ్రంగా కండిస్తున్నట్లు తెలిపారు. (Congress) కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని కేసీఆర్ అంటున్నారని, మేము ప్రజా పాలనలో విఫలం కాలేదని అన్నారు. మేము ప్రజలకు చేసింది ప్రచారం చేయడంలో విఫలం అయ్యామని చెప్పారు. బీఆర్ఎస్‌కు చింత చచ్చిన ఇంకా పులుపు చావలేదన్నారు. దొంగ సోషల్ మీడియాతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, మీరు భ్రష్టుపట్టించిన పరిపాలనను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం గాడిలో పెడుతుందన్నారు.

కాంట్రాక్టర్లు ఓపిక పట్టాలి

డీప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పాత బకాయిలు చెల్లించలేక పలాయనం చిత్తగించిండని మాజీ మంత్రి హరీశ్‌రావు అంటున్నారని మండిపడ్డారు. హారీశ్‌రావు ఆర్థిక మంత్రిగా ఉండి పాత బకాయిలు ఒక్కటి కూడా చెల్లించలేదని, దీనిపై ఆయన మాట్లాడడానికి సిగ్గు ఉండాలని ఫైర్ అయ్యారు. కాంట్రాక్టర్లు ఓపిక పట్టాలని, ఒక్క ఒక్క బిల్లును ప్రభుత్వం క్లియర్ చేస్తాదని భట్టి విక్రమార్క ముందే చెప్పారని గుర్తుకు చేశారు.

Next Story