- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG News : రేపు పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం.. తాడోపేడో తేలనున్న కొండా మురళి వ్యవహారం
హైదరాబాద్(Hyderabad)లోని గాంధీ భవన్‌లో రేపు పీసీసీ క్రమశిక్షణ కమిటీ(PCC Disciplinary Committee) కీలక సమావేశం జరపనుంది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లోని గాంధీ భవన్‌లో రేపు పీసీసీ క్రమశిక్షణ కమిటీ(PCC Disciplinary Committee) కీలక సమావేశం కానుంది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు రేపటి పీసీసీ సమావేశం కీలకంగా మారనున్నట్టు సమాచారం. ఈ కమిటీ ముందుకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి(Konda Murali) వర్సెస్ వరంగల్ కాంగ్రెస్ నేతలంతా హాజరు కానున్నారు. అయితే ఇటీవల ఓ సమావేశంలో కొండా మురళి తనపై, సురేఖపై కుట్ర జరిగిందని, ఈ కుట్ర వెనుక వరంగల్ కాంగ్రెస్ నేతలు ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
అలాగే కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్ ను కలిసి మంత్రి కొండా సురేఖను జిల్లా నేతలు ఒంటరిని చేశారని ఫిర్యాదు చేస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు వరంగల్ కాంగ్రెస్ నేతలు కూడా మీనాక్షీ నటరాజన్ ను కలిసి కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కమిటీ ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య వివాదాలను పరిష్కరించి, పార్టీ ఐక్యతను బలోపేతం చేయడంలో ఈ సమావేశం కీలక పాత్ర పోషించనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.






