- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండా సుస్మిత వ్యాఖ్యలు.. పార్టీ నేతలకు మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరిక
కులాల గురించి కొండా సుస్మిత వ్యాఖ్యలు సరికాదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మంత్రుల పంచాయితీ ముగిసిన అధ్యాయం అని పార్టీ నేతలు ఆచితూచి మాట్లాడాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. కులాల గురించి మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత మాట్లాడి ఉండాల్సింది కాదని ఎవరు ఎక్కడైనా కులాల గురించి, మతాల గురించి మాట్లాడటం ఆక్షేపణీయం అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ అక్కడ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొండా సురేఖ ఓఎస్డీ విషయంలో పోలీసులు రావడంతో తాను పానిక్ అయినట్లు సుస్మిత చెప్పారని తెలిపారు. ఎంత ఎదిగితే అంత ఒదగాలని, గోడలకు చెవులు ఉండే సమయం… జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. కొండా ఓఎస్డీ విషయంలో పోలీసులది కమ్యూనికేషన్ గ్యాప్ అని దీనిని కేటీఆర్, హరీష్ రావు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితులు అన్నింటిని హైకమాండ్ అన్ని గమనిస్తుందని అందరం హైకమాండ్ రాడార్‍లో ఉన్నామన్నారు.
ఎమ్మెల్యేలకు డీసీసీ ఛాన్స్:
కొంతమంది ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ కీలక విషయాలు వెల్లడించారు. మంత్రి ఉత్తకుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి కోసం అప్లై చేశారని, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డీసీసీ బాధ్యతలు తీసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు డబుల్ పోస్టులుగా చూడబోమని స్పష్టం చేశారు. అప్పటికే పార్టీలో ఉండి సేవలు చేస్తున్న కుటుంబాలకు ఈ విషయంలో ఎలాంటి అడ్డంకి ఉండదన్నారు. కానీ ఉన్నపళంగా తెరపైకి వచ్చి పోస్టులు అడిగితే ఇవ్వమని స్పష్టం చేశారు. రెండు పదవులు ఉండొద్దు అనే నిబంధన ఉందని ఒక పదవికి సెలెక్ట్ అయితే ఇంకో పదవికి రాజీనామా చేస్తారన్నారు. డీసీసీల ఎంపిక విషయంలో అధిష్టానం మా అభిప్రాయాలను తీసుకున్నారని, ఉత్తం తన అభిప్రాయాలను పంపారని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ల మధ్య గురు శిష్యుల బంధం అన్నారు. పార్టీ అన్నింటికంటే సుప్రీం అని పార్టీ నియమావళికి లోబడి నడుచుకోవాలన్నారు.
కిషన్ రెడ్డికి బాధ్యత లేదా?:
కేంద్రం నుంచి సరైన విధంగా రాష్ట్రానికి సహకారం అందడం లేదని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చెయ్యాలన్నారు. మెట్రో ఫేజ్-2 కు కిషన్ రెడ్డి అడ్డంకిగా మారారని కిషన్ రెడ్డికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. బీజేపీకి ఎప్పుడూ మతం పేరుతో ఓట్లు దండుకోవడమే కదా అని విమర్శించారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్‍కు ఏం చేశారని మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. కేంద్ర మంత్రిగా ఉండి బండి సంజయ్ చిల్లరగా మాట్లాడారని విమర్శించారు.
కేసీఆర్ ను ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తాం:
కాంగ్రెస్ పాలనలో ఒక్కో నియోజక అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళడం మా సంస్కృతి కాదని మాగంటి కుటుంబ విషయాలు.. మీడియాలో చూశాకే తెలుసన్నారు. జూబ్లీహిల్స్ లో 10 ఏళ్లు బీఆర్ఎస్సే గెలిచిందని మరి ఓట్ చోరీ ఎవ్వరు చేశారని నిలదీశారు. ఓట్ చోరీపై తొలుత పిర్యాదు చేసింది రేవంత్ రెడ్డి అన్నారు. అధికారులు, మంత్రులు ఎవరైనా జవాబుదారీ తనంగా ఉండాలన్నారు. కేసీఆర్ ను ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తామని అయితే కేసీఆర్ పాలన మాత్రం గాడి తప్పి రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి తెచ్చిందన్నారు. బనకచర్ల విషయంలో కేసీఆర్ ఉదాసీనంగా వ్యవహరించారని విమర్శించారు. కవిత వాస్తవాలు మాట్లాడాలన గత పదేళ్లు పాలనలో కవిత భాగస్వామిగా ఉంది.. అపుడు అమరవీరులకు ఎందుకు న్యాయం చెయ్యలేదని నిలదీశారు.






