Revanth Reddy: స్థానిక ఎన్నికలపై బిగ్ డెసిషన్!.. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ భేటీ

by Prasad Jukanti |   (  Updated:2025-08-11 06:48:50  IST  )

సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ భేటీ అయ్యారు.

Revanth Reddy: స్థానిక ఎన్నికలపై బిగ్ డెసిషన్!..  సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో (CM Revanth Reddy) టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (PCC chief Mahesh Kumar Goud) భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో సమావేశమై ఢిల్లీలో బీసీ ధర్నా తర్వాత పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం చేయాల్సిన తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే టీపీసీసీ పీఏసీ సమావేశం (PAC meeting) తేదీ, ఎజెండా అంశాలతోపాటు పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్, బోర్డు, కమిషన్ డైరెక్టర్‌ల పోస్టుల నియామకలపై డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా ఇటీవల ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. త్వరలో టీపీసీసీ పీఏసీ సమావేశం నిర్వహించి బీసీ రిజర్వేషన్ల (BC reservations) విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వాలా, మరేదైనా ఉపాయం ఉందేమో పీఏసీలో చర్చిస్తామని చెప్పారు. మరోవైపు సెప్టెంబర్ 30లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రితో పీసీసీ చీఫ్ భేటీ ఆసక్తిగా మారింది.

Next Story