PCC chief: దొంగ పాస్ పోర్టుల బ్రోకర్ గాంధీ కుంటుబం గురించి మాట్లాడడం సిగ్గుచేటు: మహేశ్ కుమార్ గౌడ్

by Prasad Jukanti |

కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.

PCC chief: దొంగ పాస్ పోర్టుల బ్రోకర్ గాంధీ కుంటుబం గురించి మాట్లాడడం సిగ్గుచేటు: మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) విమర్శించారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన నిన్నటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ (BRS Silver Jubilee sabha) అట్టర్ ప్లాప్ అయిందన్నారు. తెలంగాణకు ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ కేసీఆరేనని (KCR) విమర్శలు చేశారు. కాంగ్రెస్ బిక్షతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి కేసీఆర్ కి గుండెల్లో గుబులు మొదలైందన్నారు. 420 హామీలంటూ విమర్శిస్తున్న కేసీఆర్ మీ పదేళ్ల బిఆర్ఎస్ పాలన 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. టైం, వేదిక మీరే డిసైడ్ చేయండి చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా? ఫాం హౌస్ దాటి వచ్చే దమ్ము కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయంలో కేసీఆర్ కుటుంబం రైజింగ్ అయిందని జన్వాడలో ఉన్న ఫాం హౌస్ లు ఎవరివని ప్రశ్నించారు. కేసీఆర్ అరాచక పాలనను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు.

కేసీఆర్ శకం ముగిసింది:

రజతోత్సవ సభలో జనాల కంటే విస్కీలు ఎక్కువ ఉన్నాయని అసలు ఆ సభలో అసలు మహిళలే కనిపించలేదన్నారు. వరంగల్ సభ లో కేసీఆర్ ప్రసంగంలో పసలేదని ఇక తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిందన్నారు. దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని నకిలీ గాంధీలు అనడం కేసిఆర్ దుస్సాహసానికి పరాకాష్ట అని కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గాంధీ కుటుంబం పెట్టిన రాజకీయ భిక్షతో దొంగ పాస్ పోర్టుల బిజినెస్ చేసుకునే మీ కుటుంబం లక్షల కోట్లకు పడగలెత్తారని ధ్వజమెత్తారు. బీజేపీ-బిఆర్ ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనడానికి నిదర్శనం బీజేపీపై కేసీఆర్ రెండు నిమిషాల ప్రసంగం అని ఎద్దేవా చేశారు. బీజేపీపై కేసీఆర్ విమర్శలు నెమలి పించ్చంతో కొట్టినట్లు ఉందన్నారు. కేసీఆర్ ప్రసంగంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని మరోసారి రుజువైందన్నారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ చట్టంపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదన్నారు. బీజేపి బీఆర్ఎస్ కుట్రపన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నాయన్నారు.

మూడు ముక్క లాటతో మతి భ్రమించింది:

కేటీఆర్, హరీష్ రావు, కవిత ఆడుతున్న మూడు ముక్క లాటతో కేసీఆర్ కు మతి భ్రమించిందని కుటుంబ కొట్లాట వేగలేక రజతోత్సవ సభ పేరిట కేసీఆర్ హంగామా చేసిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. వేదికపై అయ్య కేసిఆర్, కొడుకు కేటీఆర్ ఫ్లెక్సీ తో అల్లుడు హరీష్, కూతురు కవిత మనసుకి మరోసారి గాయమైందన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కేసిఆర్ కుటుంబం దోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. దేశ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఎక్కువ దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం అన్నారు. గత ప్రభుత్వ హయంలో తెలంగాణ అన్ని రంగాల్లో విధ్వంసం జరిగిందన్నారు. పార్టీ పేరులోంచి తెలంగాణ పదాన్ని తొలగించిన కేసీఆర్ కు ఇప్పుడు జన్మభూమిని గుర్తుకు వచ్చిందా అని సెటైర్ వేశారు. తెలంగాణ సెంటి మెంటును వాడుకోవడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. గాంధీ కుటుంబం మీద విమర్శించే స్థాయి కేసీఆర్ కు లేదని దొంగ పాస్ పోర్టుల బ్రోకర్ గాంధీ కుంటుబం గురించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు.

Next Story