Mahesh Kumar Gaoud: ఫస్ట్ ఫేజ్‍లో కాంగ్రెస్ గెలుపుపై పీసీసీ చీఫ్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2025-12-12 10:24:42  IST  )

పథకాలు బాగున్నందునే కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

Mahesh Kumar Gaoud: ఫస్ట్ ఫేజ్‍లో కాంగ్రెస్ గెలుపుపై పీసీసీ చీఫ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నందునే పంచాయతీ ఎన్నికల్లో (Telangana panchayat elections) కాంగ్రెస్‍ను (Congress) దీవించారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 65 శాతానికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారని ఇదే ఉత్సాహంతో రెండో, మూడో విడతల్లోనే మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ ను దేశ, విదేశాల మీడియా ప్రశంసించిందని అన్నారు.

ఈ గ్లోబెల్ సమ్మిట్ ను విమర్శించిన బీజేపీ నేతలు రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారు అని ప్రశ్నించారు. హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేలా మా ప్రయత్నం కొనసాగుతోందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రంలోని బీజేపీ విచ్చలవిడిగా స్వార్థానికి వాడుకుంటోందన్నారు. ఈడీ, సీబీఐ, ఈసీని కేంద్రంలోని బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుంటోందని విమర్శించారు. ఎన్నికల కారణంగా పాదయాత్రలకు కొంత గ్యాప్ వచ్చిందని స్థానిక సంస్థల ఎన్నికల త్వరాత తిరిగి పాదయాత్రలు మొదలు పెడతామన్నారు. పాదయాత్రలు నిరంతరం కొనసాగుతాయని సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. 14న రాంలీలా మైధానంలో ఓటు చోరీపై మహాధర్నా నిర్వహిస్తున్నామని ఈ ధర్నాలో సీఎం, పీసీసీ, మంత్రులు పాల్గొంటారన్నారు. మెస్సీ గొప్ప ఆటగాడు. అతడిని ఓ ప్రైవేట్ సంస్థ తీసుకొస్తోంది. ఒక మ్యాచ్ ఆడమని మెస్సీని సీఎం కోరితే ఒప్పుకున్నారు. దీన్ని బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు.

Next Story