కొత్త మంత్రులకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ శుభాకాంక్షలు

by Gantepaka Srikanth |

కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముగ్గురు మంత్రులు వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిలకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

కొత్త మంత్రులకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముగ్గురు మంత్రులు వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిలకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కాబోతున్న రామచంద్ర నాయక్‌కు కూడా టీపీసీసీ అధ్యక్షులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అమలు చేస్తుందని అందుకే కులగణన చేసి బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Next Story