తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి..మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-24 15:29:11  IST  )

తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ ఓట్లతోనే బీజేపీ 8 ఎంపీలను గెలించిందని ఆరోపించారు. లేదంటే ఒక్క ఎంపీ కూడా గెలిచేవారు కాదని అన్నారు.

తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి..మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ ఓట్లతోనే బీజేపీ 8 ఎంపీలను గెలించిందని ఆరోపించారు. లేదంటే ఒక్క ఎంపీ కూడా గెలిచేవారు కాదని అన్నారు. దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ కూడా ఎంపీగా గెలిచేవాడు కాదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఓట్ చోరీపై చర్చ జరుగుతున్న వేళ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ దొంగ ఓట్లపై యుద్ధం చేస్తున్నారు. బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతోందని ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ ఖండిస్తోంది. ఇక ఇప్పుడు తెలంగాణలోనూ దొంగఓట్లు ఉన్నాయని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడంతో బీజేపీ ఎంపీలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story