TG: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్స్ రిలీజ్

by Gantepaka Srikanth |

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఈ వారం బిల్స్ రిలీజ్ చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు.

TG: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్స్ రిలీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఈ వారం బిల్స్ రిలీజ్ చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారంలో రూ.202.90 కోట్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణ పనుల దశలను బట్టి విడుదల చేయాల్సిన బిల్లు మొత్తాలను ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియలో భాగంగా ఈనెల 11వ తేదీ నాటికి పురోగతి సాధించిన మేరకు 18,247 మంది లబ్ధిదారులకు బిల్లులను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ వారం లబ్ధిదారులకు చేసిన చెల్లింపుల్లో బేస్‌మెంట్ లెవల్ నిర్మాణాలు 4,615, రూఫ్ లెవల్ (గోడలు పూర్తి) అయినవి 8,517, శ్లాబ్ వేసిన 5,115 ఇండ్లు ఉన్నాయని వివరించారు.

ఇంతవరకు రూ.2,900 కోట్ల చెల్లింపు

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంతవరకు మొత్తం రూ.2,900.35 కోట్లను చెల్లించినట్లు ఎండీ వీపీ గౌతం తెలిపారు. వీటిలో బేస్‌మెంట్ లెవల్ దాటిన ఇండ్లకు రూ.1,610.79 కోట్లు, రూఫ్ లెవల్ (ఆర్ఎల్) రూ.716.91 కోట్లు, రూఫ్ క్యాస్టెడ్ అయిన ఇండ్లకు రూ.572.65 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంతవరకు 2,33,069 ఇండ్ల పనులు ప్రారంభం కాగా, వాటిలో బేస్‌మెంట్ స్థాయిలో 90,613, గోడల నిర్మాణం పూర్తయిన స్థాయిలో 41,212 ఇండ్లు, శ్లాబ్ పూర్తయినవి 37,400 ఇండ్లు ఉన్నాయని పేర్కొన్నారు.

Next Story