- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: నాలుగు నెలలుగా సగమే వేతనం.. వర్ణణాతీతంగా ఆ ఉద్యోగుల బాధ!
సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్), మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్(మెప్మా) ఈ రెండు సంస్థలు వేర్వేరైనా పనులు మాత్రం ఒకటే.

దిశ, తెలంగాణ బ్యూరో: సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్), మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్(మెప్మా) ఈ రెండు సంస్థలు వేర్వేరైనా పనులు మాత్రం ఒకటే. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ఫ్, పట్టణ ప్రాంతాల్లో మెప్మా. సెర్ప్‌కు ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులే మెప్మాకు సైతం వర్తిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ అధికారులు మాత్రం ఈ విధంగా అమలుచేయడంలేదు. మెప్మా పేరుతో ప్రత్యేక ఉత్తర్వులు కావాలని ఓ అధికారి భీష్మించుకుని పనిచేస్తున్నారు. ఆ అధికారి తీరు 280 మంది అధికారులపై ప్రభావం చూపుతోంది. సెర్ఫ్ ఉద్యోగులకు శాలరీ ఫిక్సేషన్, హెచ్ఆర్ఏ, డీఏ, ఇంక్రిమెంట్లు సైతం అమలు చేస్తున్నారు. కానీ వేతనాలు పెంచకపోగా సగం వేతనమే ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పే స్కేల్ గురించి..
మెప్మాలోని 378 మంది ఉద్యోగులకు పే స్కేల్ ఫిక్సేషన్ కోసం చర్యలు తీసుకోవాలని ఆగస్టు 2023లో అప్పటి పురపాలక, పట్టణాభివ్రుద్ది శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. అయినా పే స్కేల్ ఫిక్సేషన్ కు సంబంధించిన పనులు ఎక్కడేసి గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.
నాలుగు నెలలుగా సగం వేతనమే..
సెర్ప్‌లో ఉద్యోగులు పే స్కేల్, హెచ్ఆర్ఏ, డీఏ, ఇంక్రిమెంట్లు అమలవుతున్నాయి. మెప్మాలో కూడా అక్టోబర్2024 నుంచి మార్చి2025 వరకు అమలు చేశారు. ఏప్రిల్ నుంచి ఆపేశారు. నాలుగు నెలల నుంచి ఉద్యోగులకు సగం వేతనాలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో ఈఎంఐలు కట్టలేకపోవడంతోపాటు పిల్లల స్కూల్, కాలేజీల ఫీజులు చెల్లించలేకపోతున్నామని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక ఉత్తర్వులు కావాల్సిందేనట..
మెప్మాలోని ఉద్యోగులకు పే స్కేల్, హెచ్ఆర్ఏ, డీఏ, ఇంక్రిమెంట్లు అమలు చేయాలంటే ప్రత్యేక ఉత్తర్వులు కావాల్సిందేనని ఓ అధికారి పట్టుబడుతున్నట్టు సమాచారం. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగులను నియమించుకున్నారని, హెడ్ ఆఫీసులో మాత్రమే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా 20 మందికిపైగా నియమించుకున్నారని, వీరికి ఏ ప్రాతిపదికన పే స్కేల్, హెచ్ఆర్ఏ, డీఏ, ఇంక్రిమెంట్లు అమలు చేయాలని ఆ అధికారి ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.
ముగ్గురి అధికారులతో కమిటీ..
మెప్మాలోని ఉద్యోగుల పే స్కేల్, హెచ్ఆర్ఏ, డీఏ, ఇంక్రిమెంట్లు అమలుకు చర్యలు తీసుకునేందుకు పురపాలకశాఖ కార్యదర్శి టీకే.శ్రీదేవి ముగ్గురు జాయింట్ డైరెక్టర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. 2023, 2024లో ముఖ్యకార్యదర్శులు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా ఈ కమిటీ అధ్యయనం చేసి చర్యలు తీసుకోనుంది.






