- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టు అంజన్న చెంతకు పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది జనవరి 3న తన ఇష్టదైవమైన తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వచ్చే ఏడాది జనవరి 3న తన ఇష్టదైవమైన తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆలయ అభివృద్ధి పనులను పర్యవేక్షించనున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ, సిఫార్సుతో టీటీడీ (TTD) కొండగట్టులో భక్తుల సౌకర్యార్థం 100 గదుల ధర్మశాల, దీక్షా మండపం నిర్మాణానికి రూ.35.19 కోట్లు మంజూరు చేసింది. తన పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ నిర్మాణ స్థల ప్రతిపాదనలను స్వయంగా పరిశీలించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా దృక్పథంతో టీటీడీ ద్వారా ఈ నిధులు కేటాయించేలా పవన్ చేసిన కృషిపై భక్తుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
మరోవైపు, అంజన్న భక్తుల కోసం టీటీడీ నిధులు మంజూరు చేయడం పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వాల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించి నయాపైసా ఇవ్వకుండా మోసం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వకపోగా ఆర్జిత సేవల ఛార్జీలు పెంచి భక్తులపై భారం మోపిందని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆలయ అభివృద్ధికి బాటలు పడటం విశేషమని ఆయన పేర్కొన్నారు.






