మేడిపల్లి సత్యం 2008 నుంచి తెలుసు: పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 2008 నుంచి తనకు తెలుసని పవన్ కల్యాణ్ చెప్పారు...

మేడిపల్లి సత్యం 2008 నుంచి తెలుసు: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Telangana Minister Adluri Laxman Kumar), చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(Choppadandi MLA Medipalli Satyam)కు జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) కృతజ్ఞతలు తెలిపారు. కొండగట్టు అంజనేయను దర్శించిన ఆయన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 2008 నుంచి తనకు తెలుసని చెప్పారు. ఉస్మానియాలో ఎన్ఎస్‌యూ నాయకుడిగా ఉన్నపుడు, తనతోపాటు కలిసి పనిచేసే వారని తెలిపారు. తెలంగాణ ప్రజలు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి అని చెప్పారు. తనకు పునర్జన్మనిచ్చిన కొండగట్టు అంజన్నస్వామి దివ్య అనుగ్రహానికి ప్రత్యక్ష సాక్షి సత్యం అని తెలిపారు. తాను గతంలో కొండగట్టు సందర్శించినపుడు అర్చకులు అప్పట్లో సత్రం కావాలని కోరుకున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ అభివృద్ధి పనులు స్వామి ఆదేశంగా భావిస్తున్నానని. బలమైన సంకల్పంతో చేపట్టిన పనికి టీటీడీ బోర్డు తగిన సహకారం అందించినందుకు ఆనందంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Next Story