- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ బిడ్డ చివరి కోరిక తీర్చబోతున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు (బుధవారం) తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు (బుధవారం) తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. రాజకీయ, అధికారిక కార్యక్రమాల కోసం కాకుండా.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఒక చిన్నారి బాలుడి చివరి కోరికను తీర్చడం కోసమే ఆయన ప్రత్యేకంగా ఈ పర్యటనకు వస్తుండటం విశేషం. హన్మకొండకు చెందిన ఒక చిన్నారి బాలుడు గత కొంతకాలంగా ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నాడు. ఎలాగైనా తన అభిమాన నాయకుడు, నటుడైన పవన్ కల్యాణ్‌ను ఒకసారి ప్రత్యక్షంగా చూడాలన్నది ఆ బాలుడి ఆఖరి కోరికగా మిగిలింది. ఈ విషయం జనసేనాని దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. రేపు స్వయంగా ఆ బాలుడి నివాసానికి వెళ్లి. పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు.
భద్రతా కారణాలతో వాయిదా.. రేపు పర్యటన
నిజానికి ఈ పరామర్శ పర్యటన కొన్ని రోజుల క్రితమే జరగాల్ని ఉంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే పవన్ కల్యాణ్ హన్మకొండకు వచ్చి ఆ బాలుడిని కలవాలని భావించారు. అయితే, ఆ సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా తెలంగాణ పోలీసులు ఈ పర్యటనకు అనుమతి నిరాకరించారు. దీంతో పర్యటన వాయిదా పడింది. తాజాగా అనుమతులు లభించడంతో రేపు ఆ బాలుడి ఇంటికి వెళ్లి పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో జనసైనికులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది.






