12 ఏళ్ల తర్వాత త్రిష మూవీ రిలీజ్?

by velandi.Saikiran |

12 ఏళ్ల తర్వాత త్రిష నటించిన ఓ సినిమాను రిలీజ్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట.

12 ఏళ్ల తర్వాత త్రిష మూవీ రిలీజ్?
X

దిశ‌, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియాలో అగ్రశ్రేణి హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష.. క్రైమ్, హారర్, కామెడీ ఇలా ఎన్నో జోనర్ లో సినిమాలు చేసి సక్సెస్ అందుకుంటున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ దూసుకు వెళ్తున్నారు. ఇటీవల కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్రిషకు బాగా పాపులారిటీ పెరిగింది. విజయ్ తో త్రిష రిలేషన్ లో ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లో ఆమెకు క్రమక్రమంగా క్రేజ్ పెరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో 12 ఏళ్ల తర్వాత త్రిష నటించిన ఓ సినిమాను రిలీజ్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట.

త్రిష, అరవింద్ స్వామి జంటగా నటించిన సినిమా శతురంగ వెట్టై-2. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. 2014లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా... నిర్మాతలకు ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే ప్రస్తుతం తమిళనాడులో త్రిషకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో... ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోందట. ఇప్పుడు రిలీజ్ చేస్తేనే కలెక్షన్స్ వస్తాయని అంచనా వేసుకున్నారట. ఈ మేరకు 12 సంవత్సరాల తర్వాత శతురంగ వెట్టై-2 సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తోంది.

Next Story