తెలంగాణపై దృష్టి సారించిన పవన్ కల్యాణ్

by Gantepaka Srikanth |

తెలంగాణపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణపై దృష్టి సారించిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణపై జనసేన(Telangana Janasena) అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే పార్టీ సభ్యత్వ నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం జనసేన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్టు పెట్టారు. జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల 26 నుండి దేశ వ్యాప్తంగా నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కొంతమంది నాయకులకు జిల్లాల వారీగా, గ్రేటర్ పరిధిలో నూతనంగా విభజించబడిన 3 కార్పొరేషన్లకు వేర్వేరు ఇంచార్జులకు బాధ్యతలు అప్పగించారు. జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ నేమూరి శంకర్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు రాధారాం రాజలింగం, కావ్య మండపాక, శిరీష పొన్నూరు రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని, మిగతా దిగువ పేర్కొన్న లిస్ట్‌లో ఉన్న నాయకులు వారికి అప్పగించిన ప్రాంత పరిధిలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు విజయవంతంగా జరిగేలా కృషి చేయాలని కోరారు.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు

ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ – మహబూబ్‌నగర్, సైబరాబాద్ కార్పొరేషన్

మాడిరెడ్డి దామోదర్ రెడ్డి – వరంగల్ & హైదరాబాద్ కార్పొరేషన్

మేకల సతీష్ రెడ్డి – భువనగిరి, నల్గొండ

మాచ సుధాకర్ – నిజామాబాద్ & మేడ్చల్ మల్కాజిగిరి

సంపత్ నాయక్ – జహీరాబాద్

మిరియాల రామకృష్ణ – ఖమ్మం

వేముల కార్తీక్ – కొత్తగూడెం, ఇల్లందు, పెనుపాక, భద్రాచలం నియోజకవర్గాలు

మంథని సంపత్ కుమార్ – పెద్దపల్లి, ఆదిలాబాద్

చిరాగ్ ప్రాజిత్ గౌడ్ – చేవెళ్ల

ఆర్.కె. సాగర్ (ఆర్.కె. నాయుడు) – కరీంనగర్

దాసరి రవీష్ – మహబూబాబాద్

యదామ రాజేష్ – మెదక్

బి.మహేష్ నాయుడు – నాగర్‌కర్నూల్

Next Story