నా హక్కులను కాపాడండి.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కల్యాణ్

by Prasad Jukanti |

టాలీవుడ్ హీరోల దారిలోనే పవన్ కల్యాణ్ ఢిల్లీ అత్యున్నత న్యాయస్థాన్ని ఆశ్రయించారు.

నా హక్కులను కాపాడండి.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కల్యాణ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalya) ఢిల్లీ హైకోర్టును (Delhi High Court) ఆశ్రయించారు. వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని (personality rights protection) ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిగత హక్కులు, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్‌ మీడియాలో కొందరు వ్యక్తులు వ్యవహరిస్తున్నారని, ఈ కామర్స్ వేదికలపై పలు పోస్టులు వైరల్ అవుతున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ తరఫున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం అలాంటి లింకులను 7 రోజుల్లోపు తొలగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది. తాను తొలగించాలని కోరుకుంటున్న పోస్టుల యూఆర్ఎల్స్ ను సోషల్ మీడియా సంస్థలకు 48 గంటల్లోపు అందించాలని పవన్ కల్యాణ్ తరఫు న్యాయవాదికి కోర్టు ఆదేశించింది.

అన్న బాటలో పవన్:

గత కొన్నిరోజులుగా టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జున, జూ.ఎన్టీఆర్ తమ వ్యక్తిగత హక్కుల కాపాడాలంటూ హైకోర్టుకి వెళ్లారు. ఇప్పుడు వీళ్ల దారిలోనే పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ అత్యున్నత న్యాయస్థాన్ని ఆశ్రయించారు. అంతకు ముందు బాలీవుడ్ ప్రముఖులు అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అశ్వర్య రాయ్ బచ్చన్ వంటి ప్రముఖులు తమ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. తమ సమ్మతి లేకుండానే అనేక మంది ఏఐ ద్వారా తమ పేరు, చిత్రం, సారూప్యత, తమ గుర్తింపు వంటి ఇతర లక్షణాలను అనధికారికంగా వారి వాణిజ్య లాభం కోసం ఉపయోగించడంపై సెలబ్రెటీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారంతా కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

Next Story