- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ అకాడమీలో పాసింగ్ పరేడ్ వేడుకలు.. హాజరైన డీజీపీ జితేందర్
ఈ బ్రాస్ బ్యాండ్ అధికారులు ఇచ్చిన ప్రదర్శన చాలా అత్యున్నతంగా ఉందని, భవిష్యత్తులో రాష్ట్రంలో బెస్ట్ బ్యాండ్ గా గుర్తింపు పొందుతారని డీజీపీ జితేందర్ ప్రశంసించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బ్రాస్ బ్యాండ్ అధికారులు ఇచ్చిన ప్రదర్శన చాలా అత్యున్నతంగా ఉందని, భవిష్యత్తులో రాష్ట్రంలో బెస్ట్ బ్యాండ్ గా గుర్తింపు పొందుతారని డీజీపీ జితేందర్ ప్రశంసించారు. రాబోయే ఆగస్టు 15 లేదా రిపబ్లిక్ డే, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భాలలో ఈ శిక్షణ పొందిన టీమ్ ద్వారా ప్రదర్శనలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. రాష్ట్ర పోలీస్ అకాడమీ ఆర్ వీబీఆర్ఆర్ లో 53 మంది బ్రాస్ బ్యాండ్, బిగులర్ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ పూర్తి చేసున్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీజీపీ డాక్టర్ జితేందర్ హజరయ్యారు.
గతంలో 10 పోలీస్ యూనిట్స్ ఉండేవని రాష్ట్ర విభజన తర్వాత 29 యూనిట్లు ఉండటంవల్ల బ్రాస్ బ్యాండ్ టీమ్స్ తక్కువగా ఉన్నాయని అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ ముందుచూపుతో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా గొప్ప విషయమని డీజీపీ కొనియాడారు. ఈ శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరు మందికి డీజీపీ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి అకాడమీ జాయింట్ డైరెక్టర్ డి. మురళీధర్, డిప్యూటీ డైరెక్టర్లు ఎన్. వెంకటేశ్వర్లు, శ్రీదేవి పాల్గొన్నారు.
- Tags
- DGP Jithendar






