పాశమైలారం అగ్ని ప్రమాద ఘటన.. స్పాట్‌కు వెళ్లిన మంత్రి దామోదర

by Kema Shiva Kumar |

పాశమైలారం (Pasha Mailaram)లోని సీగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పాశమైలారం అగ్ని ప్రమాద ఘటన.. స్పాట్‌కు వెళ్లిన మంత్రి దామోదర
X

దిశ, వెబ్‌డెస్క్: పాశమైలారం (Pasha Mailaram)లోని సీగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కాసేపటి క్రితం ఘటనా స్థలాలనికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా బ్లాస్ట్‌లో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్య (Collector Praveenya)ను ఆదేశించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఎస్పీ పరితోష్ పంకజ్‌ (SP Paritosh Pankaj)తో మాట్లాడారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది చెలరేగుతోన్న మంటలకు అదుపు చేస్తున్నారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 10 నుంచి 12కు చేరింది. మియాపూర్ ఆసుపత్రిలో మరో ఇద్దరు కార్మికులు చికిత్స పొందుతూ మృతిచెందారు.

Next Story