- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేస్తాం.. నటుడు R.K నాయుడు
తెలంగాణలోని పెద్దపల్లిలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయమని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, నటుడు సాగర్ (R.K నాయుడు) అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని పెద్దపల్లిలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయమని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, నటుడు సాగర్ (R.K నాయుడు) అన్నారు. శనివారం పెద్దపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మూల హరీశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు, వీర మహిళలు సుమారు 150 మంది పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన జెండా ఎగురవేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు పోలోజు విశ్వజ్ఞ చారి, రాచూరి హరి, మెరుగు నరేష్, నవీన్ జవ్వాజి నాయకులు, కార్యకర్తలతో పాటు వీర మహిళలు పాల్గొన్నారు.






