పేపర్ లీక్ కేసు.. సమగ్ర నివేదికనివ్వండి: సీఎస్, డీజేపీ, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌లకు మరోసారి తమిళిసై లేఖ

by Disha Web Desk 1 |
పేపర్ లీక్ కేసు.. సమగ్ర నివేదికనివ్వండి: సీఎస్, డీజేపీ, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌లకు మరోసారి తమిళిసై లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎస్ శాంతికుమారి, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌కు గవర్నర్ లేఖ రాశారు. అలాగే దర్యాప్తు నివేదిక సమర్పించాల్సిందిగా సిట్‌ను కూడా ఆమె ఆదేశించారు. వీటితో పాటు టీఎస్‌పీఎస్సీలో విధులు నిర్వహిస్తూ పరీక్షలు రాసిన సిబ్బంది (రెగ్యులర్ , ఔట్‌సోర్సింగ్) వివరాలు ఇవ్వాలని గవర్నర్ కోరారు. ఈ కేసులో భాగంగా ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.

సురేష్ , రమేష్ , షమీమ్ లను సిట్ అదుపులోకి తీసుకుంది. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 12కు చేరింది. మరోవైపు.. పేపర్ లీక్ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెరపైకి మరికొన్ని కొత్త పేర్లు వస్తున్నాయి. ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు సురేష్ పాత్రపై సిట్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. టీఎస్‌పీఎస్సీ నుంచి ఇతనే పేపర్‌ను బయటకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో సురేష్ ఎంతమందికి పేపర్ ఇచ్చాడన్న దానిపై సిట్ ఆరా తీస్తోంది.

ప్రవీణ్, రాజశేఖర్‌ల పెన్‌ డ్రైవ్‌‌లలో సమాచారం లీకైనట్లు సిట్ గుర్తించింది. రాజశేఖర్ వాట్సాప్ చాటా ఆరా తీసింది సిట్. అలాగే టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న 42 మందికి నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. నిన్న మరో పేపర్ లీక్ కేసు.. సమగ్ర నివేదికనివ్వండి: సీఎస్, డీజేపీ, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌లకు మరోసారి తమిళిసై లేఖ9 మంది నిందితులను 7 గంటల పాటు ప్రశ్నించింది సిట్. దీనితో పాటు పలు అంశాలపై ఆధారాలను సేకరించింది సైబర్ క్రైమ్ టెక్నికల్ టీమ్.

ఇవి కూడా చదవండి: మెట్రో మతలబు అదే..! డిసెంబర్‌లోనే చెప్పిన ‘దిశ’



Next Story

Most Viewed