రూ. 150 కోట్ల చీటింగ్ పై మాకు సంబంధం లేదు: పంజాగుట్ట సీఐ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-17 09:35:15  IST  )

రూ. 150 కోట్ల చీటింగ్ కేసుతో తమకు సంబంధం లేదని పంజాగుట్ట సీఐ రామకృష్ణ తెలిపారు. సింగర్ మంగ్లీ తమ్ముడితో పాటు పలువురు తమను మోసం చేశారంటూ బాధితులు ఆరోపణలు చేసిన వేళ లాయర్ సుబ్బారావు వ్యవహరం సంచలనంగా మారిన విషయం తెలిసిందే...

రూ. 150 కోట్ల చీటింగ్ పై మాకు సంబంధం లేదు: పంజాగుట్ట సీఐ
X

దిశ, వెబ్ డెస్క్: రూ. 150 కోట్ల చీటింగ్ కేసుతో తమకు సంబంధం లేదని పంజాగుట్ట సీఐ రామకృష్ణ(Panjagutta CI Ramakrishna) తెలిపారు. సింగర్ మంగ్లీ(Singer Mangli) తమ్ముడితో పాటు పలువురు తమను మోసం చేశారంటూ బాధితులు ఆరోపణలు చేసిన వేళ లాయర్ సుబ్బారావు(Lawyer Subbarao) వ్యవహరం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే మంగ్లీ, సుబ్బారావు పరస్పరం చేసిన ఫిర్యాదులపైనే కేసులు నమోదు చేశామని రామకృష్ణ స్పష్టం చేశారు. బెదిరింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మద్యం తాగాడని అనుమానంతోనే న్యాయవాది సుబ్బారావును తనిఖీ చేశామని చెప్పారు. ఆధారాలు ఇవ్వకుండా పీఎస్‌ ఎదుట న్యూసెన్స్ చేయడంతో కేసు నమోదు చేశామని సీఐ రామకృష్ణ వెల్లడించారు.

కోర్టుకు లాయర్ రామకృష్ణ

మరోవైపు పంజాగుట్ట స్టేషన్‌లో లాయర్ సుబ్బారావు పట్ల వ్యవహరించిన తీరుపై ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఐ రామకృష్ణ స్పందించారు. మంగ్లీ, లాయర్ సుబ్బారావు కేసులపై క్లారిటీ ఇచ్చారు.

Next Story