- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నయ్.. ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్
కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నేటికీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతోనే గ్రామ పంచాయతీలు మనుగడ సాగిస్తున్నాయని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. శుక్రవారం ఆయన బీజేపీ బహిరంగ సభ జరగనున్న పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి ఏం తెస్తున్నారని కొందరు మాట్లాడుతున్నారని.. నేడు కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయనేది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మద్దతే లేకపోతే రాష్ట్రానికి నిధులు ఎలా వస్తాయని నిలదీశారు.
కేసీఆర్ అరాచక పాలనకు ప్రజలు గతంలోనే బుద్ధి చెప్పారని, ఇప్పుడు రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని చిత్తుగా ఓడించి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని, ఆ మార్పు బెంగాల్ ఫలితాల తరహాలోనే ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ మొదటి లక్ష్యం జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికలని, ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు అసెంబ్లీ ఎన్నికలని ఈటల స్పష్టం చేశారు.






