- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
by Naga Rani Yarlagadda |
తెలంగాణలో భారీ వర్షాలు (Telangana Rains) కురుస్తోన్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర స్థాయిలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ (Flood Control Room) ను ఏర్పాటు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు (Telangana Rains) కురుస్తోన్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర స్థాయిలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ (Flood Control Room) ను ఏర్పాటు చేసింది. ఇంజినీర్ ఇన్ చీఫ్ (ENC) ఆఫీసులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 040-3517-4352 అని తెలిపింది. ప్రజలు రోడ్లపై ఇబ్బందులు, ఇంజినీరింగ్ సమస్యలు తలెత్తితే ఈ నంబర్ ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది.
అలాగే ప్రతి సర్కిల్ రేంజ్ లో సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది. భారీ వర్షాలు, వరదలతో ఎక్కడ రోడ్లు దెబ్బతిన్నా, కల్వర్టులు కూలినా, గండ్లు పడినా వెంటనే ఆయా నంబర్లను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
Next Story






