- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ‘స్థానిక’ ఎన్నికలు.. పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో అన్ని జిల్లాల డీపీవోలకు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సామగ్రి సేకరణ, వాటి పనితీరుపై శనివారమే మండలాలు, గ్రామాల వారీగా తనిఖీలు చేసి నివేదిక అందించాలని కోరింది. అవసరమైన చోట కొత్తవి సమకూర్చేందుకు ఇండెంట్ పంపాలని స్పష్టం చేసింది. కాగా బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ రాగానే నోటీఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. కాగా, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. రెండు విడతల్లో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ముందుగా, ఎంపీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.
గతంలో.. అనగా 2019 సర్పంచ్ ఎన్నికలు రెవెన్యూ డివిజన్ల వారీగా మూడు విడతలుగా జరిగేవి. కానీ ఈసారి రెండు విడతల్లోనే పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరిగాయి. రాజకీయ పార్టీల గుర్తులు ఉండవు కాబట్టి ఫలితాలపై ప్రభావం ఉండదని అలా చేశారు. కానీ ఈసారి రెండు విడతల్లోనే పోలింగ్ పూర్తి కానుంది.






