- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T Congress : కాంగ్రెస్ లో పదవుల పంచాయితీ? మీనాక్షీతో రాములమ్మ, అద్దంకి భేటీ
హైదరాబాద్(Hyderabad)లోని గాంధీ భవన్(Gandhi Bhavan)లో నేడు కాంగ్రెస్ తెలంగాణ(Telangana Congress) వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) వరుస సమీక్షలు, భేటీలు నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లోని గాంధీ భవన్(Gandhi Bhavan)లో నేడు కాంగ్రెస్ తెలంగాణ(Telangana Congress) వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) వరుస సమీక్షలు, భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్(Addanki Dayakar), విజయశాంతి(Vijayashanthi)లు మీనాక్షి నటరాజన్‌తో కలిసి మంత్రి వర్గ విస్తరణలో తమకు అవకాశం కల్పించాలని కోరారు. విజయశాంతి 15 నిమిషాల పాటు మీనాక్షితో చర్చించి, బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని అభ్యర్థించినట్లు తెలిసింది. అలాగే అందుబాటులో ఉన్న ఎంపీలతోనూ మీనాక్షి సమావేశం నిర్వహించి, పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించారు.
ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), నల్గొండ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Reddy) కూడా పాల్గొన్నారు. ఈ భేటీలు మీనాక్షి నటరాజన్ ఫిబ్రవరిలో ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన తర్వాత పార్టీలో అంతర్గత సమన్వయం, మంత్రి వర్గ విస్తరణపై ఒత్తిళ్లు పెరిగాయి. కొందరు నాయకులు మీనాక్షి నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కొందరు నేతలు పెదవి విరుస్తుండగా.. ఇలాంటి సమీక్షల ద్వారా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారని మరికొందరు నేతలు అంటున్నారు.






