నేడే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. సాయంత్రం ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-25 08:03:59  IST  )

పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ప్రక్రియలో కీలకమైన సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారైన విషయం తెలిసిందే.

నేడే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. సాయంత్రం ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ప్రక్రియలో కీలకమైన సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారైన విషయం తెలిసిందే. జిల్లాల వారీగా రిజర్వేషన్ల గెజిట్లు పంచాయతీరాజ్​శాఖ కమిషనరేట్‌కు సోమ‌వారం మధ్యాహ్నమే చేరుకున్నాయి. 31 జిల్లాల నుంచి మూడుసెట్ల గెజిట్లు జిరాక్స్ కాపీలతోపాటు పెన్​డ్రైవ్‌లో తీసుకుని కమిషనరేట్లలోని హెల్ప్‌‌డెస్క్‌లో డీపీవో (DPO)లు అందజేశారు. వాటిని పంచాయతీ రాజ్ అధికారులు పరిశీలించి, ఆ తర్వాత జిల్లాల వారీగా ఒక్కో సెట్ గెజిట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి (State Election Commission) హ్యాండోవర్ చేశారు. అదేవిధంగా మరో గెజిట్ కాపీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు (CS Rama Krishna Rao) పంపారు. ఈ క్రమంలో ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఏసీ గాడ్స్‌లో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో సాయంత్రం 6.15కు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లుగా మీడియాకు సమాచారం అందింది.

Next Story