Vasantha Panchami : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. ఆ పాఠశాలలకు ప్రత్యేక సెలవు

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది.

Vasantha Panchami : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. ఆ పాఠశాలలకు ప్రత్యేక సెలవు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది. రానున్న వసంత పంచమి(Vasantha Panchami) వేడుకల నేపథ్యంలో తెలంగాణలోని విద్యాసంస్థలకు కీలక ప్రకటన జారీ చేసింది. తెలుగు సంవత్సరాది క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 3న వసంత పంచమి రానుంది. కాగా ఆరోజు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఆప్షనల్ హాలిడె(Optional Holidays)ను ప్రకటించింది. హిందుత్వ, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లకు ఆరోజు సెలవు ఉండనుంది. అయితే ఈ హాలిడే ఆప్షనల్ అని, దీనిపై స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. మిగతా పాఠశాలలు కూడా సెలవును ఆప్షన్ గా వాడుకోవచ్చని పేర్కొంది. కాగా వసంత పంచమి వేడుకల సందర్భంగా ఏపీ ప్రభుత్వం(AP Govt) మాత్రం ఎలాంటి హాలిడే ఇవ్వలేదు. దీంతో ఏపీలోని అన్ని పాఠశాలలు యథావిధిగా నడవనున్నాయి.

అయితే వసంత పంచమిని చదువుల తల్లి సరస్వతి దేవి పుట్టినరోజు(Goddes Saraswathi Birthday)గా భావిస్తారు. ఆరోజు సరస్వతి ఆలయాలను దర్శించి తమకు మంచి విద్యాబుద్ధులు ప్రసాదించమని కోరుకుంటూ.. ప్రత్యేక పూజలు చేస్తారు. స్కూళ్లలో చేర్పించబోయే తమ చిన్నారులకు ఆరోజు అక్షరాభ్యాసం(Aksharabhyasa) చేయించి పాఠశాలల్లో చేర్పిస్తారు. కొన్ని విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఈరోజు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని జరుపుతాయి. అందువల్లే వసంత పంచమికి ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ వసంత పంచమి ఐటీ, కార్పోరేట్ కంపనీల ఉద్యోగులకు కూడా కలిసివస్తోంది. వారు పిల్లలతో కలిసి సరదాగా టూర్ కు వెళ్లేందుకు వరుసగా మూడు రోజుల సెలవు వస్తోంది. తెలంగాణలో ఉన్న ప్రముఖ సరస్వతి అలయాలైన అదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతి టెంపుల్(Basara Saraswathi Temple), సిద్దిపేట జిల్లాలోని నాచారం సరస్వతి ఆలయాలు(Nacharam Saraswathi Temple) వసంత పంచమి రోజున భక్తులతో కిటకిటలాడనున్నాయి. మొత్తానికి పిల్లలకు ఆదివారం, సోమవారం హాలిడేస్ వస్తుండటంతో బాగా ఎంజాయ్ చేయనున్నారు.

Next Story