పాల‌మూరు-రంగారెడ్డి లిప్ట్ ఇరిగేష‌న్, పెండింగ్ ప్రాజెక్టులు వేగ‌వంతం చేస్తాం : మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

by Ratna Kumari |

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగా రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టు లు వేగవంతం చేసి చరిత్ర లో నిలిచి పోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

పాల‌మూరు-రంగారెడ్డి లిప్ట్ ఇరిగేష‌న్, పెండింగ్ ప్రాజెక్టులు వేగ‌వంతం చేస్తాం : మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి
X

దిశ‌, దేవ‌ర‌క‌ద్ర : ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగా రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టు లు వేగవంతం చేసి చరిత్ర లో నిలిచి పోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం లో దేవరకద్ర మండలం లో 32.05 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయనున్న అజిలాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆయ‌న రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య‌ శాఖ, పాడి అభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీ హరి, రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ అజిలాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని,ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వలన అజిలా పురం, గద్దె గూడెం, వెంకటాయ పల్లి గ్రామాలకు 1400 ఎకరాల ఆయకట్టుకు కోయిల్ సాగర్ సోర్స్ నుంచి సాగు నీరు అందుతుందని తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాధాన్యత నిచ్చి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. పాలమూరు రంగా రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 90 శాతం పూర్తి చేశామని చెప్పటం అబద్ధం అన్నారు ఒక్క ఎకరా ఆయకట్టుకు నీరు ఇవ్వలేదని అన్నారు. జూన్ 4, 5 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు తాను ఉమ్మడి జిల్లాలో నిర్మాణంలో ఉన్న లిప్ట్ ఇరిగేషన్ పనులు,పెండింగ్ పనులు పరిశీలించి అవసరమైన నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. జూన్ 4 న జూరాల నుంచి ప్రారంభించి 4, 5 తేదీల్లో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, నార్లాపూర్, ఉద్దండా పూర్ రిజర్వాయర్ లను సీఎం తాను పర్యటించి భూ సేకరణ,పెండింగ్ పనులకు ఎన్ని వేల కోట్ల నిధులైనా మంజూరు చేసి పూర్తి చేయనున్నట్లు తెలిపారు.


ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల నిర్మాణం భూ సేకరణకు,ఆర్&ఆర్,పెండింగ్ బిల్లులు నిధులు విడుదల చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెండింగ్. పనులు,పాలమూరు రంగా రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొడంగల్ నారాయణ పేట, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, పాల మూరు- రంగా రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ పనులు ప్రభుత్వం వచ్చే రెండున్నర సంవత్సరంల కాలంలో పూర్తి చేస్తామని ప్రకటించారు. శాసన సభ్యులు జి.మధు సూదన్ రెడ్డి కోరిన విధంగా చౌదరి పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేస్తానని సానుకూలంగా స్పందించారు. దేవరకద్ర శాసన సభ్యులు జి.మధు సూదన్ రెడ్డి మాట్లాడుతూ కోయిల్ సాగర్ కాలువల మరమ్మతులకు 150 కోట్లు మంజూరు చేయాలని, 22 వేల ఎకరాలకు అదనంగా సాగు నీరు అందించవచ్చని తెలిపారు. రూ.87 కోట్లు చౌదరి పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కు ప్రతిపాదనలు పంపామ‌ని.. అనుమతులు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ఖుష్బూ గుప్త‌, రెవెన్యూ అదనపు అద‌న‌పు క‌లెక్ట‌ర్ హ‌రి ప్రియ‌, ఎస్పీ జానకి, సర్పంచ్ అనంతమ్మ, మాజీ జడ్.పి చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story