- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలి : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పారదర్శకత్వంతో పూర్తి చేయకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు.

దిశ, వనపర్తి : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పారదర్శకత్వంతో పూర్తి చేయకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో డి.బాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఖర్చు చేయాల్సిన రూ.74 వేల కోట్లలో పదేళ్ల కాలంలో కేవలం రూ.32 వేల కోట్లు ఖర్చు చేసి 90% పనులు పూర్తి చేశామని మాజీ సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పాలమూరు- రంగారెడ్డికి పెద్దపీట వేశామని చెప్పడంహాస్యాస్పదంఅన్నారు. పెద్దపీట వేస్తే ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఇరు పార్టీల నాయకులు పాలమూరు ప్రాజెక్టుల విషయంలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారన్నారు. ఇప్పటికైనా పాలమూరు బీడు భూములకు సాగునీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అశాస్త్రీయ పద్ధతిలో మాట్లాడటం మానుకోవాలన్నారు.
రైతులు ఆగ్రహానికి గురికాక తప్పదు
పారదర్శకత్వంతో పనులు పూర్తి చేయకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని అయన హెచ్చరించారు. ప్రధాన డిస్ట్రిబ్యూటర్లు,చిన్న కాలువలు మొదలేకాలేదని,ప్రధాన కాలువలే పూర్తి చేయకుండా బీడు భూములకు నీళ్లు ఎలా పారుతాయని ప్రశ్నించారు. నిర్దిష్టమైన సమయం పెట్టుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరు వంటి వలసల జిల్లా ఆకలిని తీర్చే ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం నిర్వీర్యం చేసేందుకు విభి జి రాంజీ పేరిట పథకాన్ని తెచ్చిందన్నారు. ఈ బిల్లు ద్వారా చేసిన పనులకు 40 శాతం నిధులు పంచాయతీలే భరించేలా నిర్ణయం తీసుకోవడం దారుణం మన్నారు. కార్మికులను అభద్రతకు గురి చేసే విధంగా నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చిందని విమర్శించారు. రైతుల భూములను కార్పొరేట్లకు అప్పగించేందుకు బిజెపి కుట్ర చేస్తుందన్నారు. కేంద్రం వెంటనే నిధులు పెంచిగ్రామపంచాయతీలో ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులకు అక్రిటేషన్ విషయంలో ప్రభుత్వం పాత విధానాలను అమలు చేసి న్యాయం చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో చర్చలకే పరిమితం కాకుండా కేంద్రంపై పోరాటాలకు సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని పిలవాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్, ఏ. లక్ష్మీ, జిఎస్. గోపి, పరమేశ్వర చారి, మేకల ఆంజనేయులు, మహబూబ్ పాషా, ఎం. కృష్ణయ్య, బాల్య నాయక్,గుంటి వెంకటయ్య, ఆర్ఎన్. రమేష్, వెంకట్ రాములు తదితరులు పాల్గొ






