పాలకుర్తిలో విభేదాలు : ఈనెల 30న మరోసారి భేటీ

by Naga Rani Yarlagadda |

మున్సిపల్ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో నేతల మధ్య తలెత్తిన వివాదాలు టీపీసీసీ క్రమశిక్షణ కమిటికి వద్దకు చేరింది.

పాలకుర్తిలో విభేదాలు : ఈనెల 30న మరోసారి భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో నేతల మధ్య తలెత్తిన వివాదాలు టీపీసీసీ క్రమశిక్షణ కమిటికి వద్దకు చేరింది. ఇప్పటికే స్థానిక నేతలపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, పార్టీ నేత ఝాన్సీరెడ్డిలు ఫిర్యాదులు చేయడంతో సదరు నేతల వివరణలను ఇవ్వాలని క్రమ శిక్షణ కమిటీ ఆదేశించింది. తాజాగా ఆదివారం పాలకుర్తి నియోజకవర్గంలోని విభేదాలపైన క్రమశిక్షణ కమిటీ సమావేశమై ఈ అంశంపై చర్చింది. సమావేశం అనంతరం కమిటి చైర్మన్, ఎంపీ, మల్లు రవి మాట్లాడుతూ క్రమశిక్షణ కమిటీలో పాలకుర్తి నియోజకవర్గం నుండి ఝాన్సీరెడ్డి హాజరయ్యారని, ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డిలు హరిప్రసాద్, కృష్ణ కిషోర్ లపై పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలపై కూడా కాంగ్రెస్ క్యాడర్ ని పట్టించుకోవడం లేదు వేదిస్తున్నారనే కంప్లైంట్ కూడా వచ్చిందని మల్లు రవి చెప్పారు. దీనితో ఇరు వర్గాలను పిలిచి కమిటీ మాట్లాడుతోందని, ఇప్పటికే కిషోర్, హరిప్రసాద్ లకి షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. దీనికి వారు రిప్లై ఇవ్వడంతో పాటు రికార్డు ఎవిడెన్స్ ఇచ్చారని మల్లు రవి తెలిపారు. ఝాన్సీ రెడ్డి సైతం తన వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారని, ఈ ఆదివారం ఝాన్సీ రెడ్డిని, ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డిలని కమిటీ ముందుకు రావాలని కోరామని, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విదేశాల్లో ఉండడం తో రాలేదని, వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి వచ్చారు, ఎమ్మెల్యే వచ్చాక మరోసారి రావాలని చెప్పామని మల్లు రవి వివరించారు. ఈ నెల 30 వ తేదీ మరోసారి కమిటీ ముందు రావాలని వారికి చెప్పామని, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పొంగులేటి, జిల్లా సీనియర్ నేతలతో కూడా ఈ అంశం మాట్లాడుతామని ఆయన తెలిపారు. అందరం కలిసి కూర్చొని ఇష్యూ లేకుండా చూస్తామని, సమావేశాలు జరుగుతున్నందున ఇప్పుడే ఒక పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోలేదని, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వచ్చిన తర్వాత ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటామని, అంతిమంగా పార్టీ బలోపేతం కోసం అందరు కలిసి పని చేయాలని నేతలకు చెప్తున్నామని మల్లు రవి వివరించారు.

టీపీసీసీ చీఫ్ ​మహేష్ కుమార్ గౌడ్ పై మీడియాలో వచ్చిన కథనాలు బాధాకరం

టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారని, ఆయనపై మీడియాలో వచ్చిన కథనాలు బాధాకరమని మల్లు రవి అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కులగణనకు మహేష్ కుమార్ గౌడ్ సహకరించి ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నరు. మహేష్ కుమార్ గౌడ్ ఎన్ యూఎస్ యూఐ ప్రెసిడెంట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ కోసం పని చేసి టీపీసీసీ చీఫ్​గా ఎదిగారని, రాహుల్ గాంధీ చెప్పిన కులగణనను సీఎంతో పాటు అదే స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్ చేశారని మల్లు రవి చెప్పారు. స్థానిక నేతలను ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలతో ఆయన సమన్వయం చేస్తూ పార్టీని నడిపిస్తున్నారని మల్లు రవి తెలిపారు.

Next Story