- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పాకిస్తాన్ ISI ఏజెంట్.. వీడియో వైరల్
భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్న వేళ.. జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్న వేళ.. జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. భారత్‌లో పుట్టి.. పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న ఆమెపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జ్యోతి మల్హోత్రా హర్యానాలోని సామాన్య కుటుంబంలో పుట్టింది. 2018లో ‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి.. తన ప్రయాణ అనుభవాలను ఫాలోవర్స్‌కు అందించింది. మాటలతో, ఎక్స్‌పోజింగ్‌తో లక్షలాది ఫాలోవర్స్‌ను సంపాదించింది. యూట్యూబ్ ట్రావెలింగ్‌లో భాగంగా 2023లో పాకిస్తాన్‌కు వెళ్లింది. అక్కడ ఐఎస్‌ఐ ఏజెంట్(Pakistani ISI Agent) డానిష్‌ను పరిచయం చేసుకుంది. ఆ పరిచయం వాళ్లిద్దరి మధ్య క్లోజ్‌నెస్ పెంచింది. చివరకు శారీరక సంబంధానికి దారి తీసింది. డానిష్ మాయలో పడి దేశద్రోహానికి ఒడిగట్టింది.
భారత్‌కు సంబంధించిన అన్ని వివరాలు డానిష్(Danish)కు పంపింది. యూట్యూబర్‌ను అని చెప్పి భారత సైనిక స్థావరాలు షూట్ చేసింది. చాలా పగడ్బందీగా మనదేశ రహస్యాలను ఐఎస్‌ఐలో పనిచేస్తున్న డానిష్‌కు చేరవేసింది. చివరగా 2024లో హర్యానా-పంజాబ్ సరిహద్దులో పర్యటించి భారత సైనికుల కదలికలను ఐఎస్‌కు పంపింది. దీంతో ఆమెపై అనుమానం వచ్చి.. అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ స్వాధీనం చేసుకొని విచారించగా ఆమె టెర్రరిస్టులకు పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆమె హైదరాబాద్‌లో పర్యటించిన వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అప్పటి గవర్నర్ తమిళిసై పాల్గొన్న వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి మల్హోత్రా హంగామా చేసిన వీడియోలను పోస్టు చేస్తున్నారు. అది కాస్త వైరల్ కావడంతో హైదరాబాదీలు నోరెళ్లబెడుతున్నారు. దీని గురించి అప్పుడే తెలిసుంటే ఇక్కడే పాతేసేవారిమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
BJP is giving free VIP pass to Pakistani spy #JyotiMalhotra for events.
— 👑Che_Krishna🇮🇳💛❤️ (@CheKrishnaCk_) May 18, 2025
Don't these guys do background verification before allowing these traitors. pic.twitter.com/uoy3dNXsp1






